తిరుమల తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక కొండపైనే రూ 300 దర్శన టికెట్లు..

     Written by : smtv Desk | Fri, Jun 17, 2022, 12:49 PM

తిరుమల తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక కొండపైనే రూ 300 దర్శన టికెట్లు..

కలియుగ దైవం.. ఆపదమొక్కుల వాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు ఊహించని స్థాయిలో వస్తున్నారు . ఓ వైపు ఎండ.. రోజులు తరబడి క్యూ లైన్లు ఉన్నా భక్తులు . సాధారణంగానే వేసవిలో భారీగా భక్తులు వస్తారు.. కానీ ఈ సారి ఊహించని విధంగా భక్తులు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీలో కరోనా పూర్తిగా తగ్గడంతో నిబంధనలను సడలిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తాజాగా కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి రికార్డు స్థాయిలో భక్తులకు అనుమతినిస్తున్న నేపథ్యంలో.. తిరుమల గిరుల్లో సందడి కనిపిస్తోంది.
ఏడు కొండల వెకంటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులతో పాటు.. దేశ విదేశాల్లోని వారు కూడా తిరుమల క్షేత్రానికి వస్తారు. రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనాని అరికట్టడానికి తీసుకున్న నిబంధనలతో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అనుమతినిస్తోంది.
అయితే కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో అనేక నిబంధనలను సడలిస్తూ.. కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులకు శుభవార్తలు చెబుతూనే ఉంది. వెంకటనాథుడి దర్శనం కోసం తిరుమల తిరుపతి వచ్చే ప్రవాసభారతీయులకు దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.
ముఖ్యంగా NRI భక్తులకు తిరుమల వైకుఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ప్రత్యేక 300దర్శన టికెట్ల అమ్మకాన్ని తిరిగి కొనసాగిస్తూ..టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ సదుపాయాన్ని తిరిగి కొనసాగించనుంది. ప్రత్యేక దర్శన టికెట్లు కావాల్సిన ప్రవాసాంధ్ర భక్తులు VQC-1 వద్ద ఉన్న కౌంటర్లలో టికెట్లు పొందవచ్చు.
ఈ టికెట్లు పొందాలి అనరుకునే NRI భక్తులు తమ పాస్‌పోర్ట్, వీసాలను చూపించాల్సి ఉంటుంది. నేరుగా 300 రూపాయల దర్శన టికెట్ల కౌంటర్ దగ్గరకు వెళ్లి.. వారు ప్రవాసంధ్రులం అని చెప్పుకోవడానికి సరైన ఆధారాలు చూపిస్తే.. ఆ ఆధారాలతో వారికి దర్శనానికి సంబంధిచి 300 రూపాయల టికెట్లను అందచేయనున్నారు.
ఇటీవల భక్తుల రద్దీ అనూహ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యాన వనంలో క్యూలైన్స్ వంటిని అధికారులు పరిశీలిస్తూ.. వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నారు.
భక్తులు రికార్డు స్థాయిలో పెరగడంతో.. శ్రీ వారి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలోనే ఉంటోంది. మరోపక్క రూములు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఆరుబయటనే నిద్రించే పరిస్థితి కనిపిస్తోంది.





Untitled Document
Advertisements