కొత్త ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

     Written by : smtv Desk | Fri, Jun 17, 2022, 03:31 PM

కొత్త ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ఎక్కువ మంది ఇల్లు కొనే సమయంలో తరచుగా గృహ రుణాలపై ఆధారపడతారు. ఎక్కువ మొత్తంలో డబ్బు కర్చు పెట్టె వ్యవహారం కాబట్టి గృహ కొనుగోలుదారు ప్రధానంగా రెగ్యులేటరీ, ఫైనాన్షియల్, లొకేషనల్ అంశాలు పరిగణించాలి.
సొంత ఇల్లు కొనాలనే నిర్ణయం అంత తేలికైనది కాదు. ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. చాలా మంది భారతీయులకు సొంత ఇల్లు ఉండాలనేది పెద్ద కల. ఒక ఇంటిని సొంతం చేసుకుంటే ఆత్మ విశ్వాసం పెరగడంతోపాటు భద్రత, స్థిరత్వం కూడా లభిస్తాయి. అదే విధంగా ఇల్లు కొనుగోలు చేయడానికి వెళ్లేటప్పుడు పరిగణించవలసిన ఐదు ముఖ్యమైన అంశాలు ఇవే..
అయితే ఇంటిని కొనుగోలు చేసే ముందు, మీరు మీ ఆర్థిక స్థితి, డౌన్‌పేమెంట్‌లు, వాయిదాలను పరిశీలించాలి. ఒక ఇంటి ధర రూ.100 ఉంటే, దాన్ని రూ.120 లేదా రూ.130కి వరకు పెంచే అదనపు ఖర్చులు ఉంటాయి. ఇందులో గృహ రుణం 75-90% ఫైనాన్స్ చేయగలదు. మిగిలినవి జేబులో నుంచి ఖర్చు చేయాలి. పెద్ద డౌన్‌పేమెంట్ లోన్ అవసరాలను తగ్గిస్తుంది, EMI భారాన్ని తగ్గిస్తుంది. డౌన్ పేమెంట్‌ను సేవ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు SIP ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.25,000 పెట్టుబడి పెడితే సగటు రాబడి రేటు 12% వద్ద మూడేళ్ల తర్వాత రూ.10.9 లక్షలు లభిస్తుంది. EMIల చెల్లింపులో క్రమశిక్షణతో ఉండవలసిన బాధ్యత ఉంటుంది. దాని కోసం ఖర్చులను రీ-బడ్జెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
కొత్త ఇంటికి ఫైనాన్స్ చేయబోతున్నట్లయితే, బలమైన క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండటం మంచిది. ఇది క్రెడిట్ యోగ్యతను బలపరుస్తుంది, అతి తక్కువ వడ్డీ రేట్లలో లోన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే స్వల్పకాలిక EMIలు ఉంటే వీలైనంత త్వరగా వాటిని సెటిల్‌ చేసుకోవాలి. చాలా EMIలు మీ రీపేయింగ్ కెపాసిటీకి ఆటంకం కలిగించవచ్చు, తద్వారా ఫైనాన్స్ పొందే అర్హతపై ప్రభావం కనిపిస్తుంది.
గృహ కొనుగోలుదారులు ముందుగా తాము కొనుగోలు చేస్తున్న ఆస్తికి అవసరమైన సర్టిఫికేట్లు, చట్టపరమైన చెల్లుబాటు, స్థానిక అనుమతులు ఉన్నాయా? అనే దానిపై తగిన శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఆస్తి రిజిస్టర్ అయిందా లేదా అనేది పరిశీలించాలి.
టైటిల్ డీడ్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ కొత్త ఇంటిని కొనే ముందు తనిఖీ చేయవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆస్తి లేదా ప్రాజెక్ట్ ఆధారంగా ఉన్న భూమి టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అనేది బిల్డర్ ద్వారా ఆస్తి యాజమాన్యం, యాజమాన్యాన్ని విక్రయించే లేదా బదిలీ చేసే హక్కు. ఆస్తి ఏదైనా వ్యాజ్యంలో చిక్కుకుపోయిందా లేదా అనే దాని గురించి వివరణ ఇచ్చే పత్రం. పత్రాలను పరిశీలించడానికి న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను కూడా తనిఖీ చేయాలి. హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఇది ఆస్తికి ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేవని రుజువుగా పనిచేసే డాక్యుమెంట్.





Untitled Document
Advertisements