రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులందరి పేరు లేక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ అవకాశం మీకోసమే

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 11:49 AM

రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులందరి పేరు లేక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ అవకాశం మీకోసమే

గత కొన్నేళ్ళుగా పేర్ల నమోదు కోసం ఎదురుచూస్తున్న రేషన్ కార్డు హోల్డర్స్ గుడ్ న్యూస్..రేషన్ కార్డులు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు మిస్సయినవారి కోసం ప్రభుత్వం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కార్డులో నమోదైన కుటుంబాల్లో కొత్త సభ్యులను చేర్పించడానికి అనుమతించాలని రేషన్ కార్డు దారులు ఎన్నో ఏళ్లుగా ఎన్నో సమావేశాలలో అభ్యర్థిస్తూ వస్తున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. జనాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా రేషన్ కార్డులలో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో లేనివారు ఇప్పుడు మీ సేవ ద్వారా నమోదు చేసుకోవచ్చు..పాత రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, గ్యాస్ కనెక్షన్‌ వివరాలను దరఖాస్తులో పేర్కొన్నాలి.కుటుంబాల్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత బియ్యం లబ్ధిదారులు పొందలేకపోయారు. గతంలో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సైతం బియ్యం తీసుకోలేకపోయారు.
కుటుంబంలో ఉంటూ రేషన్ పొందలేని వారి కోసం ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సైతం బియ్యం తీసుకోలేకపోయారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు కానివారు బియ్యం పొందలేకపోయారు. కుటుంబంలోనే ఉంటూ తమ పేర్లు రేషన్ కార్డులో లేకపోవడంతో ఎన్నో విధాలుగా నష్టపోయినవారికి ప్రభుత్వం పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు





Untitled Document
Advertisements