యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఇదేనట..

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 12:25 PM

యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఇదేనట..

టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే యువరాజ్ భార్య హాజెల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తమకు కొడుకు పుట్టినట్టు జనవరి 25న యువరాజ్ సింగ్ జంట ప్రకటించింది. తాజాగా వారు కుమారుడి పేరును యువరాజ్ సింగ్ ప్రకటించాడు. తమ కుమారుడికి 'ఓరియన్ కీచ్ సింగ్' అని పేరు పెట్టినట్టు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా నెటిజన్లకి తెలియపరచారు. ఓరియన్ కీచ్ సింగ్ కు ఈ యొక్క అందమైన లోకానికి స్వాగతం పలికారు .





Untitled Document
Advertisements