గుడ్డులోని పచ్చ సోన తినడం వలన గుండె జబ్బులు వస్తాయా..

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 04:54 PM

గుడ్డులోని పచ్చ సోన తినడం వలన గుండె జబ్బులు వస్తాయా..

ఉడికించిన కోడి గుడ్డుని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇంట్లోని పెద్దవారు తరుచుగా చెప్పడం మనం వింటూనే ఉంటాము. వారు చెప్పడమే కాదు నిజానికి ఉడికించిన కోడిగుడ్డు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిదని నిపుణులు కూడా అంటారు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఉడికించిన కోడు గుడ్డులో ఫోలేట్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి12 లభిస్తాయి. 60 గ్రాముల కోడిగుడ్డు నుంచి ప్రొటీన్ - 7.9 గ్రాములు, శక్తి - 103, కేలరీలు, ఐరన్‌ - 1.26 మి.గ్రా, ఫాస్పరస్ - 132 మి.గ్రా, క్యాల్షియం - 36 గ్రా, కొవ్వులు - 7.9 గ్రా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లే కారణం. అయితే గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం వల్ల దానిలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ కారణంగా, గుండె సమస్యలు వస్తాయని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎక్కువ మంది ఎగ్ వైట్ తిని ఎల్లో పడేస్తారు. మరి నిజానికి గుడ్డులోని పచ్చ సోన తింటే గుండె సమస్యలు వస్తాయా అంటే..
నిజానికి గుడ్డు తీసుకోవడం వల్ల.. ఓ వ్యక్తి శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయులు ప్రభావితం కావని హార్వర్డ్ హెల్త్ పబ్లిష్‌ ఓ నివేదికలో వెల్లడించింది. మన శరీరంలోని చాలా కొలెస్ట్రాల్ లివర్‌ ద్వారా తయారవుతుంది. నివేదిక ప్రకారం, లివర్‌ ప్రధానంగా మన ఆహారంలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ద్వారా కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది, మన ఆహార కొలెస్ట్రాల్ కాదు. కాబట్టి గుండె ఆరోగ్యంపై గుడ్డులోని కోలెస్ట్రాల్‌ ప్రభావం చూపదు. సంతృప్త కొవ్వు విషయానికొస్తే, ఒక పెద్ద గుడ్డులో 1.5 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది.

ఒక కోడిగుడ్డులో 1.5 గ్రాముల పచ్చసొన, 213 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్, 75 క్యాలరీలు ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ 300 మిల్లీగ్రాములకు మించకూడదు. కాబట్టి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో అధిక మొత్తం లభించినట్లే.

రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల వచ్చే.. కొలెస్ట్రాల్‌ మన ఆరోగ్యానికి సురక్షితమని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దానిలో చాలా వరకు హార్వర్డ్‌ అధ్యయనాలే ఉన్నాయి. రోజుకు ఒక గుడ్డు తినేవారిలో గుండెపోటు, స్ట్రోక్‌, ఇతర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఏ అధ్యయనం వెల్లడించలేదు. ఈ అధ్యనాల ప్రకారం రోజుకి ఒక గుడ్డు తినడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాంగా ఉంటారు.





Untitled Document
Advertisements