త్వరలో అందుబాటులోకి రానున్న 5జే సేవలు.. ఆ తరువాత సంవత్సరంలోపు 6జీ కూడా..

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 11:27 AM

త్వరలో అందుబాటులోకి రానున్న 5జే సేవలు.. ఆ తరువాత  సంవత్సరంలోపు 6జీ కూడా..

మొబైల్ టెలికాం రంగంలో 1జీ నుంచి ప్రస్తుతం 4జీ నడుస్తోంది. అయితే 4జీ నుంచి కూడా త్వరలో 5జీ రాబోతోంది . ఈ 5జీ సేవలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మొదట మన దేశంలో 20 నుంచి 25 నగరాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు..మొబైల్ టెలికాం రంగంలో 1జీ నుంచి ప్రస్తుతం 4జీ నడుస్తోంది. అయితే 4జీ నుంచి కూడా త్వరలో 5జీ రాబోతోంది . ఈ 5జీ సేవలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మొదట మన దేశంలో 20 నుంచి 25 నగరాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. డిసెంబర్ నాటికి ఆయా నగరాల్లో 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. జూలైలో స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించిన ప్ర‌క్రియ మొద‌లుకానుంది. అందుకోసం దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. భారత్ లో అభివృద్ధి చెందుతున్న 4జీ, 5జీ ఉత్పాదనలు, సాంకేతికతల వినియోగానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నామన్నారు.ఇక ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ లో డేటా ధరలు గణనీయంగా తక్కువ అని మంత్రి చెప్పుకొచ్చారు. 20 ఏండ్ల వ్యాలిడిటీ క‌లిగిన ఈ స్పెక్ట్ర‌మ్‌ను ద‌క్కించుకునేందుకు టెలికం సంస్థ‌ల‌తో పాటు అమెజాన్‌, టీసీఎస్‌, ఎల్అండ్ టీ వంటి ప్రైవేటు ఎంట‌ర్‌ప్రైజెస్ కూడా బిడ్డింగ్‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి.. సమాజంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం.. ఇది అత్యాధునిక సాంకేతికతతో పనిచేయడమే కాకుండా.. రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది.‘నెట్‌వర్క్ స్లైసింగ్‌’ అనే ప్రక్రియ ద్వారా సిమ్‌కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ఈ 5జీ ద్వారా సమాచారాన్ని అత్యంత వేగంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు 4జీ కంటే వంద రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. అయితే ఇది అవసరాన్ని బట్టి వివిధ తరంగాలను వినియోగించుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫోన్‌తో జోడించిన వస్తువులు పని చేసేటప్పుడు మరోలా.. ఇలా వేర్వేరు పనులను ఒకేసారి సమర్థంగా చేయగలుగుతుంది. ఇక ధర విషయానికి వస్తే.. 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు ఖరీదు ఎక్కవగా ఉంటుందనే చెప్పాలి.పారిశ్రామిక వర్గాల నుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు 5జీ సేవలను ప్రారంభించాయి. సింగపూర్, థాయ్ లాండ్ వంటి దేశాలతో పాటు.. యూరప్ లో కూడా దీని ఉనికి కనిపిస్తోంది. మన దేశంలో ఆలస్యం కావడానికి కారణం 5జీకి అనుగుణంగా మరిన్ని సెల్ టవర్లు నిర్మించాల్సి ఉంటుంది.అంతే కాకుండా ఆ డేటా వేగాన్ని తట్టుకునేందుకు రాగి వైర్లకు బదులుగా కొత్తగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను వాడాల్సి ఉంటుంది. ఈ మార్పుల కోసమే కొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. మరో కారణం కోవిడ్ ఎఫెక్ట్ కూడా అని చెప్పవచ్చు. ఈ మౌలికమైన మార్పుల కోసమూ కొంత సమయం పడుతుంది. ఇది కాకుండా కొవిడ్ వల్ల స్పెక్ట్రమ్‌ వేలం ఆలస్యం కావడం ఓ ముఖ్యకారణం. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు కేంద్ర కేబినెట్ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమ‌తినిచ్చింది. దీంతో భార‌త్‌లో కూడా 5జీ సేవ‌లు త్వ‌ర‌లోనే ముందుకు రానున్నాయి .





Untitled Document
Advertisements