ఒత్తిడిని తగ్గించే గుణం సంగీతానికి ఉందట!

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 12:45 PM

ఒత్తిడిని తగ్గించే గుణం సంగీతానికి ఉందట!

సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష.అది ఏ భాషలోనిది అయిన మనకి అర్ధం కాకపోయినా నచ్చితే పాడేస్తూ ఉంటాం .సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. జూన్‌ 21న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం..మనకు నచ్చిన పాట లేదా మనసుకు హత్తుకునే సంగీతం విన్నపుడు విన్నపుడు మనకు తెలీకుండానే ఒక రకమైన తన్మయత్వం పొందుతాం. ఎప్పుడైనా కాస్త డీలా పడినట్లు, ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచిపాట, వీనులవిందైన సంగీతం వింటే ఆ ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. నూతనోత్తేజం కలుగుతుంది.ఇక సంతోష సమయాలలో ఐతే చెప్పనక్కర్లేదు. పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఉరకలెత్తించే, హుషారు కలిగించే సంగీతం, పాటలు వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి.బాత్‌రూమ్‌లో కూనిరాగాలు తీసే వారు, బరువు పనులు చేసేవారు, రేవుల్లో బట్టలు ఉతికే రజకులు.. ఒకరేమిటి.. శ్రమ తెలియకుండా తమకు తోచిన పాటలు పాడుకోవడం అందరికీ తెలిసిందే.


పొత్తిళ్లలోని పాపాయి అని చేసే శబ్దంలో ఉంది సంగీతం, తల్లి తన బిడ్డను ఊయలలూపుతూ పాడే లాలిపాటల్లో ఉంది సంగీతం, ఏడుస్తున్న పసిబిడ్డ ఆ ఏడుపు ఆపి హాయిగా కేరింతలు కొట్టేటట్లు చేయగల అమ్మమ్మలు, బామ్మల జోలపాటల్లో ఉంది సంగీతం, శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం.మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు.మెదడుకు, హృదయానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు చేసే చికిత్సలో రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా వైద్యులు సత్ఫలితాలను సాధించిన సందర్భాలు ఎన్నో మనకు తెలుసు. బీపీ, తలనొప్పి వంటి వాటిని సంగీత చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు నిరూపించారు కూడా. ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్‌ 21ని వరల్డ్‌ మ్యూజిక్‌ డేగా పాటించాలని ప్రకటించింది.ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్‌మ్యూజిక్‌ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ‘ఫెటె డె లా మ్యూసిక్‌’ అని ‘మేక్‌ మ్యూజిక్‌ డే’ అని కూడా పిలుస్తారు.కానీ వరల్డ్‌ మ్యూజిక్‌ డే విషయంలో అలాంటి నిబంధనలేమీ లేవు. సంగీతం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారైవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఉద్దండులు, సాధారణమైన వారు అన్న తారతమ్యాలేవీ ఉండవు. సంగీత రంగంలో గొప్పవారి నుంచి ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారి దాకా, పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా నిరభ్యంతరంగా పాల్గొన వచ్చు.





Untitled Document
Advertisements