ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవట..

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 04:49 PM

ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవట..

కొన్నికొన్ని సార్లు మనం ఎన్నో రకాలుగా కష్టపడుతూ.. ఎంతగా సంపాదన పై దృష్టి పెట్టినా కూడా డబ్బుకు ఇబ్బందులు పడుతూనే ఉంటాము. ఎన్నో రకాల ఆర్ధిక సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అయితే సంపాదకు ఆధిదేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నం చీపురు. సంపద, ఆనందం ,శ్రేయస్సు ఆమెపై ఆధారపడి ఉంటుంది. చీపురును కాలుతో తాకినా దానిపైనుంచి దాటినా లోకంలో ధనానికి లోటు ఉంటుంది. అంతేకాదు, వాస్తు ప్రకారం చీపురును సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమని శాస్త్రం చెబుతోంది. చీపురు ఇంటికి పశ్చిమ దిశలో ఉంచాలని తెలిపింది. అలా ఉంచితే లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని.. ఖర్చులు తగ్గుతాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇతర దిశల్లో చీపురు ఉంచడం వల్ల నష్టాలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు. విరిగిన పాత్రలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఈ పనికిరాని పాత్రలన్నీ మీ దగ్గర ఉంటే ఇంటికి అరిష్టం ఇవన్నీ ఇంట్లో ఉంటే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అందరి ఇళ్లలో చాలా వరకు స్టీలు పాత్రలే ఉంటాయి. విరిగిన వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.ఇంట్లో స్పైడర్ వెబ్ ఉంటే ఆ ఇంటికి అరిష్టం అంటారు. అందుకే ఇంట్లో ధన సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శనివారం రోజు ఇంట్లో బూజు దులపడం వంటి పనులు చేయాలి అంటారు . వాస్తు ప్రకారం కాక్టస్ లేదా ముళ్ల చెట్లను ఇంట్లో నాటకూడదు. ఇది కుటుంబ కలహాలను పెంచుతుంది జీవితంలో చాలా చెడు సంఘటనలు ఎదుర్కోవాల్సివస్తుంది అని వాస్తు నిపుణులు అంటారు.





Untitled Document
Advertisements