పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ.. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 05:12 PM

పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ.. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్

మన దేశంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్‌ఓ) ఆదేశాలు.. ప్రైవేటు సంస్థల్లో రేట్ల పెంపునకు కారణమైంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మాత్రం ధలు పెంచలేదు. వివరాలివే..పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మంగళవారం (జూన్ 7)నాడు చేసిన ప్రకటనలో రేట్ల పెంపు జోలికి పోలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, రెండు నెలలుగా పెంపు చోటుచేసుకోలేదు. అయితే కేంద్రం యూఎస్ఓ ఆదేశాల తర్వాత ప్రైవేటు ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలు పెంచాయి. హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.64 వద్ద, డీజిల్ రేటు రూ. 97.8 వద్ద ఉన్నాయి. విజయవాడలో పెట్రోల ధర లీటరుకు రూ. 111.74గా, డీజిల్ రూ. 99.83 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ. 110.46గా, డీజిల్ రూ.98.25గా ఉంది. కర్నూలులో పెట్రోల్, డీజిల్ వరుసగా రూ.112.10, రూ.99.83గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది.చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.92గా, డీజిల్ రేటు రూ.87.87గా ఉన్నాయి. ప్రైవేటు ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులను సైతం కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్‌ఓ) పరిధిలోకి తేవడంతో సదరు రిటైలర్లు నిల్వలు లేకున్నా ‘నో స్టాక్’ బోర్డు పెట్టడానికి వీల్లేకుండా పోయింది. దీంతో బంకులు తెరిచే ఉంచి, నిర్దేశిత పరిమాణంలోనే అమ్మకాలు జరపాలని సంస్థలు ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్రం యూఎస్ఓ ఆదేశాలు జారీ చేసిన తర్వాత బంకులను కచ్చితంగా తెరిచే ఉంచాల్సిన పరిస్థితిలో నయారా ఫ్యూయెల్ వంటి ప్రైవేటు సంస్థలు రేట్లను పెంచాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు పెంపు రూ.2 నుంచి రూ.7 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరి ఎక్కువగా అయిపోతున్నాయి . బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 1.02 శాతం పెరిగి బ్యారెల్‌ ధర 115.69 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.51 శాతం పెరిగి బ్యారెల్ 110.39 డాలర్లకు పెరిగింది .





Untitled Document
Advertisements