చివరి గమ్యం వరకు పోరాడుతూ .. చావు అంచుల వరకు

     Written by : smtv Desk | Thu, Jun 23, 2022, 05:58 PM

చివరి గమ్యం వరకు పోరాడుతూ .. చావు అంచుల వరకు

అమెరికాకు చెందిన స్విమ్మర్‌ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘ‌ట‌న బుడాపెస్ట్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ అక్వాటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో జ‌రిగింది.25 ఏళ్ల స్విమ్మర్‌ అనిత.. స్విమ్మింగ్ పూల్ దిగువ( కింది ) భాగంలోకి వెళ్లిన త‌ర్వాత శ్వాస తీసుకోలేక‌పోయింది. సోలో ఫ్రీ ఈవెంట్‌లో త‌న రొటీన్ పూర్తి చేసిన త‌ర్వాత అనితా సొమ్మసిల్లీపోయి స్విమ్మింగ్ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా పైకి తేలియాడుతూ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్‌ అనితా అల్వరేజ్‌ను ర‌క్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గ‌త ఏడాది క్రితం బార్సిలోనాలో జ‌రిగిన ఒలింపిక్ క్వాలిఫ‌యింగ్ ఈవెంట్‌లోనూ అనితా అల్వరేజ్‌ పోటీల్లో పాల్గొంటూనే సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని అక్కడి కోచ్ లు చెపుతున్నారు .





Untitled Document
Advertisements