ఆర్టీసీ ప్రయాణికులకు షాక్‌...

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 11:35 AM

 ఆర్టీసీ ప్రయాణికులకు షాక్‌...

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరిగాయి అని.. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది అయినప్పటికీ నష్టం వస్తుందని ఈసారి మళ్ళి టికెట్​ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు రౌండ్​ ఫిగర్​ అంటూ ఓసారి, డీజిల్​ సెస్​ పేరుతో రెండుసార్లు, టోల్​ సెస్​, ప్యాసింజర్​ సేఫ్టీ సెస్​ తో దాదాపు 35 శాతం వరకు చార్జీలు పెంచింది. ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సైతం పంపించారు. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రపొజల్స్​ లో సూచించారు. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని అధికారులు చెప్తున్నారు. టికెట్​ ధరల పెంపుపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​, ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే, డీజిల్​ సెస్​ రూపంలో రెండుసార్లు పెంచగా.. టికెట్​ ధరలు ఉండవని భావించారు. సెస్​ ల రూపంలో అదనంగా వసూళ్లు చేస్తున్నా.. ఇంకా రూ. 2.40 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు టికెట్​ ధరల పెంపు అనివార్యంగా మారుతోంది.
టికెట్​ ధరల పెంపుపై ప్రతిపాదనలు పూర్తి చేశారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్​ ధరలు పెరుగనున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్​ ప్రెస్​ బస్సులకు ఇది వర్తించనుంది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్​ ధర 20 శాతం వరకు ఉండనుంది. డీలక్స్​, లగ్జరీ, సూపర్​ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు 20 శాతం పెంపు ఉండనుంది. దీంతో రోజువారీ నష్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్​ పై రూ. 2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని అధికారులు ఆఫ్​ ది రికార్డు చెప్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి, ఆర్టీసీ చైర్మన్​, ఎండీ సమక్షంలో సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్​ కూడా గతంలోనే ప్రకటించారు. మినిమం చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్​ టికెట్​ ధరలు మరింత పెరుగనున్నాయి.





Untitled Document
Advertisements