మాజీ సిబ్బందికి ఆహ్వానం.. పలికిన ఎయిర్ వేస్‌

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 01:52 PM

మాజీ సిబ్బందికి  ఆహ్వానం.. పలికిన ఎయిర్ వేస్‌

ప్రముఖ విమాన సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ మళ్లీ ఊపిరితీసుకుంది . నియామక ప్రక్రియను పున: ప్రారంభించింది. మాజీ క్యాబిన్‌ సిబ్బంది తిరిగి విధుల్లోకి హాజరుకావాలని సంస్థ కోరింది. శుక్రవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'సొంత ఇంటిని మించింది లేదు. ఎయిర్‌లైన్‌ను తిరిగి ప్రారంభించడంలో మాతో కలిసి నడవాలని మాజీ జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతానికి మహిళా సిబ్బందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం అని పేర్కొన్నారు . మేము త్వరలో పురుష సిబ్బందిని తీసుకుంటాము' అని సంస్థ ట్వీట్‌ చేసింది. ఏవియేషన్‌ రెగ్యులేటరీ మే 20న రీవాలిడేటెడ్‌ ఎయిర్‌ ఆపరేషన్‌ సర్టిఫికేట్‌ను(ఎఒసి) జెట్‌ ఎయిర్‌ వేస్‌కు మంజూరు చేయడంతో.. సదరు సంస్థ కార్యకలాపాలను పున: ప్రారంభించింది. మాజీ సిబ్బంది పిలుపుతో తమ కార్యాచరణ నియామక ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ సిఇఒ సంజీవ్‌ కపూర్‌ ట్వీట్‌ చేశాడు .రాబోయే రోజుల్లో పైలట్లు, ఇంజనీర్ల నియామకం ప్రారంభమవుతుందని అతను చెప్పారు . ప్రస్తుతమైతే ఈ ప్రారంభంలో మాజీ సిబ్బంది మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ యాజమాన్యంలో ఉండగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్‌ 17, 2019లో మూసివేసిన సంగతి తెలిసిందే . జులై-సెప్టెంబర్‌లో త్రైమాసికంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను పున: ప్రారంభించాలని ఎయిర్‌లైన్‌ బావిస్తుంది





Untitled Document
Advertisements