అందుకోసమే బీజేపీ ద్రౌపది ముర్మును ఎన్డిఏ అభ్యర్దిగా ఎంపిక చేసారా ?

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 01:56 PM

అందుకోసమే బీజేపీ ద్రౌపది ముర్మును ఎన్డిఏ అభ్యర్దిగా ఎంపిక చేసారా ?

ఎన్డిఏ అభ్యర్దిగా ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ ప్రతిపాదించారు ,ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ బలపరిచారు .దాంతో ఈ రోజు (24 జూన్ )న పలువురు కేంద్ర మంత్రులు ,ఎన్డిఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఆమె అభ్యర్దిత్వానికి మద్దతు తెలిపిన ఇతర తటస్థ రాజకీయ నేతల ప్రాంగణంలో ఆమె మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు .ఈ నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పరిశీలించి స్టాంప్ వేసి వాటిని స్వీకరించారు . ద్రౌపది ముర్మును అభ్యర్దిత్వానికి ఎంపిక చేసిన నేపధ్యంలో ఎన్డిఏకి మద్ధతు క్రమక్రమంగా పెరుగుతుంది .ద్రౌపది ముర్ము ఓడిస్సా ప్రాంతానికి చెందిన గిరిజన ఆదివాసి మహిళా కావడం తద్వారా ఇద్దరు అభ్యర్ధులను పోల్చుకుంటే దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచిన ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అలంకరించే అవకాశం గిరిజనులకు ,ఆదివాసులకు రాలేదు .ప్రధాని మోదీ ద్రౌపది ముర్ముకి అవకాశం కల్పించి మార్కులు కొట్టేసారనే చెప్పొచ్చు .జరగబోయే ఎన్నికలలో బీజేపీ అధికారం చేజేక్కించుకోవాలంటే గిరిజన ఆదివాసియుల మద్ధతు చాల అవసరం .ఆ సమీకరణాలు దృష్టిలో పెట్టుకునే వ్యూహాత్మకంగా ద్రౌపదిని అభ్యర్ధిగా ఎంపిక చేసారని కూడా అనుకోవచ్చు .





Untitled Document
Advertisements