'క్యూఆర్‌' కోడ్స్ తో పేమెంట్‌ చేస్తున్నారా...

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 07:46 PM

 'క్యూఆర్‌' కోడ్స్ తో పేమెంట్‌ చేస్తున్నారా...

ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంట డబ్బులు ఉండనక్కర్లేదు. డెబిట్‌ కార్డ్‌ కూడా అవసరం లేదు. స్మార్ట్‌ ఫోన్‌.. అందులో డిజిటల్‌ చెల్లింపుల ఎంపిక ఉంటే చాలు. దీంట్లో భాగంగానే 'క్యూఆర్‌' కోడ్స్ వచ్చాక మన జీవితం మరింత సులభం అయిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ పద్ధతి వల్ల మోసాల బారినపడుతున్నవారూ ఉన్నారు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారు తప్పనిసరిగా 'క్యూ ఆర్‌' కోడ్‌ గురించి తెలుసుకోవాల్సిందే!
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు చెల్లించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా మన జీవితం మరింత సులభతరంగా మారిపోయింది.
క్షణాల్లో చెల్లింపులు..నెఫ్ట్‌ లేదా ఆర్‌టిజిఎస్‌ లావాదేవీలను పూర్తి చేయడానికి యుపిఐ అనేది స్వల్పకాలిక చెల్లింపు పద్ధతి. ఆర్థిక లావాదేవీని జరపడానికి .. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్, నగదు మొత్తం, అంకెల పిన్‌ చేస్తే చాలు లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది. క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించే యాప్స్‌ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌ లు ప్రధానమైనవి.
తర్వాత జాబితాలో భీమ్‌ యాప్, మొబిక్‌విక్, పేజ్‌యాప్, రేజర్‌పే మొదలైనవి ఉన్నాయి. క్విక్‌ రెస్పాన్స్‌ అనే క్యూఆర్‌ కోడ్‌ బార్‌కోడ్‌ డేటాతో ఎన్‌కోడ్‌ చేసే స్కాన్‌. బాధితుల డబ్బు దొంగిలించడానికి మోసగాళ్లు వారి సొంత క్యూఆర్‌ కోడ్‌లను సృష్టిస్తారు. లేదా బాధితుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రాబడతారు.
సాధారణంగా బయట షాపింగ్‌ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తదు. ఆన్‌లైన్‌ బిజినెస్‌లో భాగంగా తమ వస్తువును విక్రయించడానికి చేసే పోస్టులో మోసగాళ్లు క్యూఆర్‌ కోడ్‌ కూడా రూపొందిస్తారు. ఈ లింక్‌ను వాట్సప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. దీనికి ఆకర్షితులై లింక్‌ ఓపెన్‌ చేశాక, నగదు చెల్లింపులకు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయమని బాధితుడిని కోరుతారు. బాధితులు తమ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. డబ్బులు జమ చేస్తామని నమ్మించి, మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తారు.





Untitled Document
Advertisements