మద్దతు తేలుపమని ఫోన్ కాల్ ద్వారా అడిగిన... ద్రౌపది ముర్ము...

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 08:08 PM

మద్దతు తేలుపమని  ఫోన్ కాల్ ద్వారా అడిగిన... ద్రౌపది ముర్ము...

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమెతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఇతర నేతలు కూడా ఉన్నారు.
కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతూ ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు. అలాగే, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. అంతకుముందు ముర్ముని అభ్యర్థిగా పేర్కొంటూ బీజేపీ మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కూడా దేశంలోని పలువురు నేతలను కలిసి మద్దతు అడగనున్నారు. కాగా, నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ద్రౌపతి ముర్ము ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.





Untitled Document
Advertisements