7 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కోవాక్సిన్..

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 11:46 AM

7 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు  కోవాక్సిన్..

చిన్నపిల్లలకు కోవాక్సిన్ అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ డీజీసీఐకు సిఫార్సు చేసింది. 7 నుంచి 14 ఏళ్ల చిన్నారుల్లో కోవోవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతి, డీజీసీఐకు నిపుణుల కమిటీ సిఫార్సు..7 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవోవాక్స్‌ను అత్యవసర పరిస్థితులలో వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని భారత సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల బృందం శుక్రవారం సిఫార్సు చేసింది. తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి సిఫార్సు పంపించింది. మార్చి 16న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కోవోవాక్స్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కోవిడ్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కోవోవాక్స్ పై చర్చించింది. ఏప్రిల్‌లో జరిగిన చివరి సమావేశంలో నిపుణుల ప్యానెల్ దరఖాస్తుపై సంస్థ నుంచి మరింత సమాచారాన్ని కోరింది. డిసెంబరు 28న పెద్దవారిలో కొన్ని షరతులతో కోవోవాక్స్ అనుమతికి అంగీకరించింది. మార్చి 9న 12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గలవారిలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగాన్ని ఆమోదించింది. దేశంలో మార్చి 16 నుంచి 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు టీకాలు వేయడం గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ: వ్యాక్సిన్ తదుపరి దశలో గత ఏడాది మార్చి 1న 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి నిర్దిష్ట అనారోగ్య పరిస్థితులతో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. గత ఏడాది మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు వేయడానికి ప్రభుత్వం అనుమతించింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ తదుపరి దశ జనవరి 3 నుంచి ప్రారంభించింది. జనవరి 10 నుంచి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రికాషనరీ డోసులు అందిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ -19వ్యాక్సిన్‌ల ప్రికాషనరీ డోసులు ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాలలో ప్రారంభించింది.





Untitled Document
Advertisements