జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు...ఎందుకో తెలుసా...!

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 04:13 PM

జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు...ఎందుకో తెలుసా...!

వర్షాకాలం మొదలైన ఇంకా ఎండల తీవ్రత తగ్గడం లేదు.. ఉక్కపోతతో ఇప్పటికీ నగరవాసులు ఇబ్బందులు పడుతునే ఉన్నారు. వేడి, ఉక్కపోత నుంచి రిలీఫ్ పొందాలంటే ఏసీలు ఉండాల్సిందే..
ఏసీలు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.. అయితే వెంటనే కొనేసుకోండి. లేదంటే ఏసీల ధరలు భారీగా పెరగబోతున్నాయి. జూలై 1 నుంచి ఏసీలు మరింత ప్రియం కానున్నాయి. ఈలోపు ఏసీలు కొనేసుకుని పెట్టుకోండి. ఎయిర్ కండీషనర్లపై ఇటీవలే ప్రకటించిన ఎనర్జీ రేటింగ్ నియమాల కారణంగా ధరలు అమాంత పెరగనున్నాయి.
ఏప్రిల్ 19 నాటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ( బి ఇ ఇ ) నోటిఫికేషన్ ప్రకారం.. ఎయిర్ కండీషనర్‌ల ఎనర్జీ రేటింగ్ నియమాలు జూలై 1, 2021 నుంచి మారనున్నాయి. కొత్త నియమాలు.. మొదట జనవరి, 2022లో అమల్లోకి వస్తుందని భావించారు. కానీ, తయారీదారుల అభ్యర్థన మేరకు.. ప్రభుత్వం ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ను అందించింది. తద్వారా కంపెనీలు తమ ఇన్వెంటరీని క్లియర్ చేసుకునే అవకాశం కలిగింది. భారత మార్కెట్లో కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఎయిర్ కండీషనర్‌ల ఎనర్జీ రేటింగ్‌ను ఒక స్టార్ తగ్గించాలి. అంటే.. జూలై 1 నుంచి 5-స్టార్ AC రేటింగ్ వెంటనే 4-స్టార్‌లకు తగ్గిపోనున్నాయి.
కొత్త ఇంధన సామర్థ్య రేటింగ్ మార్గదర్శకాల ఫలితంగా.. భారత్‌లో ఏసీల ధరలు రాబోయే కాలంలో 7-10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. అయితే, వచ్చే నెల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలను ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై AC తయారీదారులు వెల్లడించలేదు. మార్గదర్శకాల ప్రకారం.. AC తయారీదారులు తమ మోడల్‌ల డిజైన్‌లను కొంచెం మార్చవలసి ఉంటుంది. ఎయిర్ ప్లో, రాగి గొట్టాల ఉపరితల వైశాల్యాన్ని పెంచనున్నారు. ఎయిర్ కండీషనర్లు సమర్థవంతంగా పనిచేయాలంటే కంప్రెసర్‌ను కూడా అందించాలి. పాత మోడల్‌ల కన్నా తక్కువ శక్తిని వినియోగించుకోవాలి. ఈ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత.. జూన్ 30, 2022లోపు తయారైన అన్ని ఎయిర్ కండీషనర్ల ఎనర్జీ రేటింగ్ గడువు ముగియనుంది.
ఈ ACలు స్టార్ రేటింగ్ తగ్గిపోనున్నాయి. ప్రస్తుతం ఉన్న అన్ని మోడల్‌లు 30 జూన్ 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత ఆటోమాటిక్‌గా వాటి గడువు ముగుస్తుందని( బి ఇ ఇ) ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఫలితంగా, జూన్ 30, 2022 తర్వాత తయారైన కొత్త ఎయిర్ కండీషనర్‌లు కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఫైవ్-స్టార్ రేటింగ్‌ను పొందుతాయి. కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ నార్మ్ జూలై 1 2022 నుంచి డిసెంబర్ 31 2024 వరకు వర్తిస్తుందని తెలిపింది. ఆ తర్వాత 5-స్టార్ రేటింగ్ ఉన్న అప్లయన్సెస్ 4-స్టార్‌కి పడిపోతాయని( బి ఇ ఇ) నోటిఫికేషన్ పేర్కొంది. రాబోయే కొత్త నియమం.. గడువు ముగిసిన వెంటనే ( బి ఇ ఇ) మార్గదర్శకాలను అప్‌డేట్ చేయనుంది.





Untitled Document
Advertisements