జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్..

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 11:47 AM

జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి..అయితే ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్ బీఐ జారీ చేస్తుంది. దీని ప్రకారం.. జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.
నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. రెండు శనివారాలతో కలిపితే సాధారణ సెలవులు ఏడు ఉన్నాయి. బక్రీద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శని, ఆదివారాలు మినహా బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. పలువురు బ్యాంకులు మూసిఉన్న తేదీలు తెలియ బ్యాంకుల వద్దకు వచ్చి వెనుదిరిగి పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులకు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే మందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు.
జూలై నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ఇక జూలై 9న సెకండ్ శనివారం(అదేవిధంగా బక్రీద్), జూలై 23న నెలలో నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇతర రోజుల్లో జూలై 1న కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర (భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు), జూలై 5న(మంగళవారం) గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ (జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 7న ఖర్చి పూజ (అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 11న ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 13న భాను జయంతి (గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 14న బెన్ డియెంక్లామ్ (షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 16న హరేలా (డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు).





Untitled Document
Advertisements