పబ్ కేసులో మరో కీలక పరిణామం ,కోర్టును ఆశ్రయించిన పోలీసులు..

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 12:04 PM

పబ్ కేసులో మరో కీలక పరిణామం ,కోర్టును ఆశ్రయించిన పోలీసులు..

జూబ్లీహిల్స్‌లో ఆమ్నేషియా పబ్‌ కేసు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా తెలంగాణ పోలీసులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఆరుగురు(ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్‌) నిందితుల డీఎన్‌ఏ సేకరణ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల డీఎన్‌ఏ సేకరణ కోసం జువైనల్‌ బోర్డుతోపాటు కోర్టు అనుమతిని సైతం పోలీసులు కోరారు. దీంతో, ఆరుగురు నిందితుల డీఎన్‌ఏను సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపనున్నట్టు స్పష్టం చేశారు. ఇన్నోవాలో సేకరించిన ఆధారాలతో అధికారులు.. డీఎన్‌ఏను సరిపోల్చనున్నారు. కాగా, విచారణలో సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌గా డీఎన్‌ఏ రిపోర్టు కీలకం కానుంది. ఇదిలా ఉండగా, అవసరమైతే బాధితురాలి డీఎన్‌ఏ శ్యాంపిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో సబ్మిట్‌ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల పాస్‌పోర్టులను కూడా సీజ్‌ చేయాలని పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారికి బెయిల్‌ లభిస్తే.. దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించబడింది .





Untitled Document
Advertisements