ఆరేళ్ల కొడుకు కోసం తల్లి తయారు చేసిన టైమ్ టేబుల్...

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:01 PM

 ఆరేళ్ల కొడుకు కోసం తల్లి తయారు చేసిన టైమ్ టేబుల్...

బాల్యంలో మనమంతా టైమ్ టేబుల్‌ను రూపొందించుకునే ఉంటాం. అందులో ఆడుకోవడానికి, చదవడం నుండి తినడం వరకు, పడుకోవడం..ఇలా అన్నింటికీ టైమింగ్స్ రాసుకుంటాం. ఈ దినచర్యను అనుసరించడానికి తల్లిదండ్రులు పిల్లలకు సహకారం అందిస్తారు. ఇటువంటి వాటికీ సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి టైమ్ టేబుల్ ఒకటి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టైం టేబుల్‌ని ఒక తల్లి తన ఆరేళ్ల కుమారుని కోసం తయారు చేసిన ఘటన డిల్లిలో జరిగింది..
ఈ టైమ్ టేబుల్ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రీడిట్ ఖాతాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ టైమ్ టేబుల్‌లో అలారం సమయం ఉదయం 7:50 అని రాసి ఉండగా, బెడ్‌పై నుంచి లేవడానికి సమయం 8:00 వరకు అని పేర్కొన్నారు, ఆ తర్వాత బ్రష్ 8.15 , అల్పాహారం 8.30 , పండ్లు తినడం, 9 కి స్కూల్ కి వెళ్ళడం 4.30 కి వచ్చి స్నాక్స్ తినడం మరియు పండ్లు తినడం.. పాలు తాగడం, టెన్నిస్ ఆడటం, హోం వర్క్ చేయడం, 9 కి డిన్నర్ చేసి , నిద్రపోయే సమయం గురించి ప్రస్తావించారు. ఈ టైం టేబుల్ లో ఇలా క్రమశిక్షణంగా పిల్లల్లి పెంచితే పిల్లలు మనం కోరుకున్న స్థాయికి వెళ్తారు..ఇలా టైం టేబుల్ మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి.. క్రమశిక్షణంగా పెంచండి..

Untitled Document
Advertisements