ముంబైలో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:15 PM

ముంబైలో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం..

ముంబైలోని కుర్లా ఈస్ట్‌లోని నాయక్‌ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 12 మందిని శిథిలాల నుంచి రక్షించగా.. ముగ్గురు మృతి చెందారు. మరో 25 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా బీఎంసీ అధికారులు వెల్లడిస్తున్నారు . ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. సంఘటనా స్థలాన్ని బీఎంసీ అదనపు కమిషనర్‌ అశ్విని భిడే సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవనాన్ని కూల్చివేయాలని నోటీసులు ఇచ్చామన్నారు. అంతకు ముందు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాకే సైతం ఘటన స్థలాన్ని సందర్శించారు. నాలుగు బవనాలకు నోటీసులు అధికారులు నోటీసులు జారీ చేశారని, అయినా పలు కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయన్నారు. అందరినీ రక్షించడమే తమ బాధ్యత అని, భవనాలను కూల్చివేయనున్నట్లు పేర్కొన్నారు. బీఎంసీ నోటీసులు చేస్తే భవనాలు ఖాళీ చేయాలన్నారు.





Untitled Document
Advertisements