పీవీ నరసింహారావు 101 వ జయంతి .. నివాళిలు అర్పించిన కేసీఆర్

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:46 PM

 పీవీ నరసింహారావు 101 వ జయంతి .. నివాళిలు అర్పించిన కేసీఆర్

ఈరోజు పీవీ నరసింహారావు 101 వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గతంలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న రోజుల్లో పీవీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి.. దేశాన్ని కాపాడిన ఆధునిక భారత నిర్మాత దివంగత అంటూ కేసీఆర్ పీవీ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఆయనకు ఘన నివాళి అర్పించారు. అంతేకాకుండా పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ అని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి బాట పట్టించిన మహోన్నతుడని పేర్కొన్నారు. తన వినూత్నమైన సంస్కరణలతో దేశ సంపద ఎన్నో రెట్లు పెరిగేలా చేశారని అన్నారు. పీవీ నాయకత్వంలో దేశం ఆర్థికంగానే కాకుండా విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, అణుశక్తి వంటి రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధిని సాధించిందని చెప్పారు. పీవీ నరహింహారావు నుంచి తమ ప్రభుత్వం ఎంతో స్ఫూర్తిని పొందిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నాయకత్వం దేశానికే మార్గాన్ని చూపుతుందనే విషయాన్ని పీవీ నిరూపించారని అన్నారు. పీవీ స్పూర్థితో అయన అడుగుజాడల్లో తాము ముందుకు వెళ్తామని చెప్పారు.

Untitled Document
Advertisements