హైదరాబాద్ యువకుడి ఘనత.. ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు.. సినీ దర్శకుల ప్రసంశలు

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 03:29 PM

హైదరాబాద్ యువకుడి ఘనత.. ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు.. సినీ దర్శకుల ప్రసంశలు

సినిమా రంగంలో అవకాశాల కోసం చాలా మంది ఎడురుచుస్తారు . ఒక్క ఛాన్స్ దొరికిన తమ సత్తా నిరుపించుకోవచ్చు అని ఆరాటపడతారు .కాని హైదరాబాద్ కి చెందిన దీపక్ రెడ్డి అనే కుర్రాడు మాత్రం ఎర్ర తివాచి ఏర్పరచుకున్నాడు .వెండితెర పై తన సత్తా చాటాలన్న ఆసక్తితో పాత కథని సైతం తనకున్న టాలెంట్ తో కొత్తగా మార్చాడు. రివర్స్ స్కీన్ ప్లే తో కొత్త అనుభూతిని కలిగించాడు . మనసా నమహ అన్నది రొమాంటిక్ కామెడి కథనంతో సాగే లఘు చిత్రం. 2020 జనవరి లో విడుదల చేసిన షార్ట్ ఫిల్మ్ ‘మనసా నమహ’ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటుంది.ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు వరించాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ గా దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. గిన్నిస్ సర్టిఫికెట్ ఫోటోను దీపక్ రెడ్డి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.దీంతో మనసా నమహ సినిమాను తీసిన దీపక్ రెడ్డికి తెలుగు మరియు తమిళ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మేజర్ సినిమా దర్శకుడు, నటుడు అడవిశేషు, పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ సైతం ఈ ఘనత సాధించినందుకు దీపక్ రెడ్డిని అభినందించారు.‘నీవు ఫీచర్ ఫిల్మ్ తో ప్రపంచాన్ని షేక్ చేసే వరకు నేను వేచి చూడలేకపోతున్నాను’’అని అడవిశేషు ట్వీట్ చేసారు.గౌతమ్ మీనన్ కి ‘మనసా నమహ’నచ్చడంతో తమిళం లోకి డబ్ చేసి రిలీజ్ చేసారు . మనసా నమహ లఘు చిత్రానికి ముందు "హైడ్ అండ్ సీక్" మరియు "ఎక్స్క్యుస్మి" అనే 2 లఘు చిత్రాలు తీసాడు

Untitled Document
Advertisements