నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో.. రోడ్డు మీద పడుకునే అతన్ని ప్రేమించి పెళ్ళాడిన యువతి

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 03:47 PM

నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో.. రోడ్డు మీద పడుకునే అతన్ని ప్రేమించి పెళ్ళాడిన యువతి

అత‌డు నిరాశ్ర‌యుడు. ఓ కార్ల షోరూంలో ప‌నిచేసేవాడు. కార్లు తుడుస్తూ బ‌తుకీడ్చేవాడు. చింపిరి జుట్టు, మాసిన బ‌ట్ట‌ల‌తో వీధుల్లో తిరిగేవాడు. వ‌చ్చిన డ‌బ్బుల‌తో క‌డుపునింపుకొని రోడ్‌సైడ్ ప‌డుకునేవాడు. అత‌డిని ఓ రోజు ఓ అమ్మాయి చూసింది. వెంట‌నే అత‌డికి హెయిర్ క‌ట్ చేయించింది. అత‌డిని అందంగా మార్చేసింది. క‌ట్ చేస్తే వారిద్దరికీ ఇప్పుడు పెళ్లై ప‌దేళ్ల‌యింది. ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ అంద‌మైన ప్రేమ క‌థ‌తోపాటు ఆ వ్య‌క్తి వీధుల్లో సంచ‌రిస్తున్న‌ప్పటి ఫొటోల‌ను లుజ్ అనే మ‌హిళ పోస్ట్ చేయ‌గా,సోషల్ మీడియాలో వైర‌ల్‌గామారింది. మెక్సికోలోని మైకోకాన్‌లోని న్యూవో శాన్ జువాన్‌కు చెందిన లుజ్ యెసేనియా గెరోనిమో సెర్నా అనే యువ‌తి 2009లో కార్లు కడుగుతున్న దుకాణం వెలుపల జువాన్ మెన్డోజా అల్విజార్‌ను చూసింది. జువాన్ చింపిరి జుట్టుతో పిచిపిచ్చిగా క‌నిపించాడు. అత‌డు ఒక నిరాశ్ర‌యుడు. రోడ్‌సైడ్ నిద్రించేవాడు. కానీ, చాలా సంస్కార‌వంతుడు. అత‌డు ఎదుటివారితో మాట్లాడే తీరు లుజ్‌ను ఆక‌ట్టుకున్న‌ది. తొలిచూపులోనే అత‌డితో ప్రేమ‌లో ప‌డిపోయింది. జువాన్‌తో మాట‌క‌లిపిన లుజ్ మొద‌ట అతడికి హెయిర్‌క‌ట్ చేయించింది. హెయిర్ క‌ట్ త‌ర్వాత అత‌డి రూప‌మే మారిపోయింది. లుజ్ కంటికి జువాన్ హీరోలా క‌నిపించాడు. అత‌డి అందాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. అత‌డితో ప్రేమ‌లో ప‌డింది. రెండేళ్ల త‌ర్వాత వాళ్ల ఇంట్లో ఒప్పించి జువాన్‌ను పెళ్లి చేసుకున్న‌ది. ప్రస్తుతం జువాన్ తాపీగా ప‌నిచేస్తున్నాడు. ఖాళీ స‌మ‌యాల్లో మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లుజ్‌ను పెళ్లి చేసుకొని నిరాశ్ర‌యుడైన జువాన్ ఇప్పుడు ఓ ఇంటి య‌జ‌మాని అయ్యాడు. ఈ అంద‌మైన ప్రేమ‌క‌థ గురించి తెలుసుకున్న నెటిజ‌న్లంతా లుజ్‌ను ప్ర‌శంసల్లో ముంచెత్తుతున్నారు. ‘నువ్వు రాణివి.. అత‌డిని నీ జీవితంలోకి ఆహ్వానించి మంచి లైఫ్ ఇచ్చావ్’ అంటూ మంచి స్పందనలు తెలుపుతున్నారు .

Untitled Document
Advertisements