నేట్టిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానమిచ్చిన ఆనంద్ మహేంద్ర..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 04:54 PM

నేట్టిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానమిచ్చిన ఆనంద్ మహేంద్ర..

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మ‌హీంద్రా ట్విట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఫన్నీ క్యాప్షన్లు, వైరల్ వీడియోలు, మీమ్స్‌, వైర‌ల్ ఫొటోల‌ను షేర్ చేస్తారు. హాస్యాస్పదమైన ట్వీట్ల‌తోపాటు యువ‌త‌లో స్ఫూర్తి నింపే వీడియోల‌ను పోస్ట్ చేస్తారు. లోక‌ల్ టాలెంట్‌, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. వీటితోపాటు త‌న ఫాలోవ‌ర్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు చ‌మ‌త్కారంగా స‌మాధానాలు ఇస్తుంటారు. తాజాగా, ‘మీ అర్హ‌తేంట‌’అని ఓ ఫాలోవ‌ర్ అడ‌గ్గా , ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.‘నాకు ప‌దివేల లోపు కారు కావాలి.. మీరు విక్ర‌యించ‌గ‌ల‌రా?’ అని ఆనంద్ మ‌హీంద్రాను మే లో ఒక ఫాలోవ‌ర్ అడ‌గారు. దీనికి స‌మాధానంగా అమెజాన్‌లో అమ్మ‌కానికి పెట్టిన బొమ్మ ( డాల్ ) థార్‌కారు ఫొటోను ఆనంద్ మ‌హీంద్ర కామెంట్‌లో పెట్టాడు . తాజాగా, ఓ యూజ‌ర్ ‘మీ విద్యార్హ‌తేంటి?’ అని ప్ర‌శ్నించారు. దీనికి ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు. ‘వాస్త‌వంగా చెప్పాలంటే నా వయస్సులో ఏ మెరిట్‌కైనా ఏకైక అర్హత అనుభవం మాత్ర‌మే’ అని సమాధనం ఇచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియా లో అందరిని ఆక‌ట్టుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ 5700 మంది లైక్ చేయ‌గా, 322 మంది రీట్వీట్ చేస్తున్నారు .

Untitled Document
Advertisements