ఖాతాదారులకు తీపి కబురు అందించిన ఎస్ బి ఐ.. ఇకపై సెలవు రోజుల్లో సేవలు!

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 05:56 PM

ఖాతాదారులకు తీపి కబురు అందించిన ఎస్ బి ఐ.. ఇకపై  సెలవు రోజుల్లో సేవలు!

ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలను అందించే క్రమంలో.. ఎస్ బి ఐ ఇటీవల రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటి ద్వారా కస్టమర్లకు అన్ని రకాల సేవలను అందిస్తామని బ్యాంక్ ప్రకటించింది. ఎస్ బి ఐ కస్టమర్‌లు ఇకపై ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ క్రమంలోనే.. ఎస్ బి ఐ ప్రారంభించిన కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లు 1800 1234, 1800 2100. నిన్న(జూన్‌ 27 న, సోమవారం ) ఎస్ బి ఐ ఓ ట్వీట్‌లో.. బ్యాంకింగ్ సమస్యలకు వీడ్కోలు చెప్పండి. ఎస్ బి ఐ కాంటాక్ట్ సెంటర్‌(1800 1234, లేదా.. 1800 2100 టోల్‌ఫ్రీ నంబర్లకు)కు కాల్ చేయండి అని పేర్కొంది.
ఈ క్రమంలో.. ఎస్ బి ఐ కస్టమర్‌లు ఈ నంబర్‌లకు ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచి అయిన డయల్ చేయవచ్చు. వెబ్‌సైట్ లేదా యాప్ సేవలను ఉపయోగించలేని వారికి, డిజిటల్‌ సేవలపై అవగాహన లేని వారికి టోల్‌ఫ్రీ నంబర్‌లు ఉపయోగపడతాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ నంబర్ల ద్వారా.. సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి. అంటే కస్టమర్లు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ఎస్ బి ఐ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా చివరి ఐదు లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. ఎ టి ఎం కార్డ్ బ్లాకింగ్ స్టేటస్‌ను, అలాగే కార్డ్ డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఎస్ బి ఐ టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా, కస్టమర్‌లు తమ చెక్‌బుక్‌ల డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల మునుపటి ఏటీఎం కార్డ్‌ బ్లాక్ అయిన పక్షంలో.. కొత్తఎ టి ఎం కార్డ్ కోసం అభ్యర్థించవచ్చు. ఎస్ బి ఐ టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు వారి వివరాలను, డిపాజిట్ వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పొందవచ్చు.
ఎస్ బి ఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి టోల్‌ఫ్రీ నంబర్‌లను డయల్ చేయవచ్చు. ఎస్ బి ఐ 24X7 హెల్ప్‌లైన్ నంబర్‌లు 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 2100 (టోల్-ఫ్రీ), లేదా.. 080-26599990కు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి డయల్‌ చేయవచ్చు. ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్‌ల వివరాలను 24 గంటల్లో ఫోన్‌లో తెలుసుకోవచ్చు. డిపాజిట్లు & లోన్ స్కీమ్‌లు, ఇతర సేవల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ నంబర్ల ద్వారా కూడా ఎస్‌బీఐని సంప్రదించవచ్చు.. టోల్ ఫ్రీ నంబర్: 1800 11 2211, టోల్ ఫ్రీ నంబర్: 1800 425 3800, టోల్ నంబర్: 080-26599990.

Untitled Document
Advertisements