వరల్డ్ నెంబర్ వన్ గా పారాలింపిక్ షూటర్..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 06:03 PM

వరల్డ్ నెంబర్ వన్ గా పారాలింపిక్ షూటర్..

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని చాలామంది అనడమే కాని నిరూపించలేరు . అలాంటి వారిలో ఒక ఒలంపిక్ చాంపియన్ కూడా ఉంటారు. వారిలో అవనీ లేఖరా కూడా ఉంటుంది. ఈ పారాలింపిక్ షూటర్.. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి అందరి మనసులు గెలుచుకుంది . ఈ 20 ఏళ్ల షూటర్.. ఇప్పుడు తాజాగా రెండు విభాగాల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌గా అవతరించింది. ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంతోపాటు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్1 విభాగాల్లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవని లేఖరా అవతరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆమె తను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది ‘‘ఇంత అచీవ్‌మెంట్ సాధించడం చూస్తే మరింత మోటివేట్ అవుతున్నా’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ క్రమంలో అవనికి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు తెలిపరుస్తునారు .https://twitter.com/AvaniLekhara/status/1541655855091023872?s=20t=DhoNKfhxOfqbk_q9-STAug

Untitled Document
Advertisements