ఏకంగా కంటి లోపల జాతీయ జెండా చిత్రించుకున్న వ్యక్తి.!

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 01:28 PM

ఏకంగా కంటి లోపల జాతీయ జెండా చిత్రించుకున్న వ్యక్తి.!

ఈ ఏడాది భారతదేశం నిర్వహించుకుంటున్న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయం బత్తూరుకు చెందిన ఒక కళాకారుడు, సామాజిక కార్యకర్త ఎవ్వరూ ఊహించలేని పనిని చేసారు.
మినియేచర్ ఆర్టిస్ట్ అయిన ఆయన స్వాతంత్ర ఉద్యమం గురించి అవగాహన పెంచడానికి తన కంటి తెల్ల గుడ్డుపై జాతీయ జెండాను చిత్రించుకున్నాడు. రాజా అనే ఈ వ్యక్తి తన కుడి కంటిలో త్రివర్ణ పతాకాన్ని చిత్రించడం కోసం మైనం, గుడ్డులోని తెల్లసొన మిశ్రమాన్ని ఉపయోగించినట్లు తెలిపాడు. అద్దంలో చూసుకుంటూ పెయింటింగ్ పూర్తి చేసినట్లు చెప్పాడు. పెయింట్‌ చేస్తున్నప్పుడు అద్దం వైపు తన చూపును నిలపడం కష్టంగా అనిపించిందని, 16 ప్రయత్నాల తర్వాత పూర్తి చేశానని అన్నాడు. అయితే, తనలా ఎవ్వరూ ఇలా చేయొద్దని హెచ్చరించాడు. దీనిపై స్పందించిన కంటి ఆసుపత్రి వైద్య సలహాదారులు మాత్రం "ఇలాంటి చర్యలు ఖచ్చితంగా కంటికి హాని కలిగిస్తాయి. అతను త్రివర్ణ పతాకాన్ని గీయడానికి ఉపయోగించిన పదార్థాలు అలెర్జీలు, కంటి దురదను కలిగించవచ్చు" అని అన్నారు. అయినా, భారతీయ జెండా పట్ల అతనికున్న ప్రేమ, గౌరవం అతన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది.

Untitled Document
Advertisements