ఈ విధంగా చేస్తే లవర్స్ ఎప్పటికీ విడిపోరంటున్న శృతిహాసన్‌!

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 01:53 PM

ఈ విధంగా చేస్తే లవర్స్ ఎప్పటికీ విడిపోరంటున్న శృతిహాసన్‌!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి నేడు ఈ స్థానంలో ఉండి అగ్రతారగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో వరుస షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం ఆయనతో కలిసి హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.తనకు ప్రేమలో ఉండడమే ఎంతో బాగుందని పెళ్లి అంటే ఎంతో కంగారుగా ఉంటుంది అంటూ గతంలో పెళ్లి గురించి ఈమె ప్రస్తావించిన విషయం మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి ఒక హాట్ ఫోటో షేర్ చేస్తూ ప్రేమ గురించి ప్రేమికుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడితో కలిసి జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఒక సెల్ఫీ దిగారు. ఈ విధంగా ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ.. ఎవరైతే కలిసి తింటూ కలిసి వర్క్ అవుట్ చేస్తూ ఉంటారో అలాంటి లవర్స్ ఎప్పటికి విడిపోరంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా శృతిహాసన్ చేసిన ఈ పోస్ట్ కి నేటిజన్ ల నుంచి కూడా భారీ మొత్తంలో స్పందన లభిస్తుంది. కొందరు నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోగా మరికొందరు తన పోస్టుకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఈమె బాలకృష్ణ, చిరంజీవితో పాటు ప్రభాస్ సరసన కూడా నటిస్తున్నారు.

Untitled Document
Advertisements