శృంగారంలో ఎంజాయ్‌ చేయాలంటే భార్యాభర్తలిద్దరూ ఇలా చేయండి..

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 08:13 PM

శృంగారంలో ఎంజాయ్‌ చేయాలంటే భార్యాభర్తలిద్దరూ ఇలా చేయండి..

భార్యభర్తల మధ్య శృంగారం విషయంలో దాపరికాలు ఉండకూడదు. అన్ని విషయాలు ఓపెన్ గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఉండాలి. మీకు ఏం కావాలి అనే విషయాలను మీ భాగస్వామికి తెలియజేయాలి. అలాగే భాగస్వామి ఓపీనియన్స్ కూడా తెలుసుకోవాలి. ఇద్దరికి సంతృప్తి అనిపించినప్పుడే శృంగారాన్ని అనుభవించినట్లు అని తెలుసుకోవాలి. చాలామంది ఒకరికొకరి కంఫర్ట్ గురించి తెలుసుకోరు. ఎలా పడితే అలా చేసుకుంటూ పోతారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేసుకుంటూ పోతే శృంగారంలో మజా ఉండదు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరూ అర్థం చేసుకుని పాల్గొంటేనే మధురంగా ఉంటుంది. మీ పార్టనర్ ను అర్థం చేసుకుని ఆమె ఇష్టానికి తగ్గట్లు నడిస్తే అప్పుడు సెక్స్ లైఫ్ ఎంతో బాగుంటుంది. మీ పార్టనర్ తో ఆనందంగా గడపటానికి వీలుంటుంది. శృంగారం సమయంలో వేగం అనేది పనికారాదు. పార్టనర్ కోరికలు తెలుసుకుని దానికి తగ్గట్లు చేయాలి. అంతేకాని ఫాస్ట్ గా పని కానిచ్చేయకూడదు.
శృంగారం సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఇద్దరి కలిసిమెలిసి ఉండాలి. హాయిగా కూర్చోని మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉండాలి. అప్పుడే శృంగారం సమయంలో మీ మధ్య అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీకు నచ్చినట్లు కాకుండా మీ పార్టనర్ యొక్క ఫాంటసీల గురించి తెలుసుకోండి. ఆ ఫాంటసీ ప్రకారం ఫాలో అవ్వండి. మీరు ఏది పడితే అది చేస్తే నచ్చకపోవచ్చు. అందుకే పార్టనర్ కోరికలు తెలుసుకుని అలా మలుచుకోండి. అలాగే ఒకరినొకరు కాంప్లీమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఇద్దరి మధ్య సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. శృంగారం సమయంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల పార్టనల్స్ ఆ సమయంలో సంతృప్తి చెందుతారు





Untitled Document
Advertisements