తెలివిగా టెడ్డీబేర్​ లో దూరిన దొంగ.. సులభంగా కనిపెట్టిన పోలీసులు!

     Written by : smtv Desk | Sat, Aug 13, 2022, 04:32 PM

తెలివిగా టెడ్డీబేర్​ లో  దూరిన దొంగ.. సులభంగా కనిపెట్టిన పోలీసులు!

18 ఏళ్ల వయసులోనే దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు అతను. సూపర్ మార్కెట్లలో సరుకులు కొట్టేయడం నుంచి ఖరీదైన కార్లు దొంగిలించడం వరకు ఎన్నో కేసులు అతని పై నమోదై ఉన్నాయి. ఇతగాడి కోసం పోలీసులు సైతం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు అతని కొరకు వెతుకుతున్న విషయం తెలిసి దీంతో తన ప్రేయసి ఇంటికి వెళ్లి దాక్కున్నాడు. పోలీసులకు ఇది తెలిసి, ప్రేయసి ఇంటిపై రైడ్ చేశారు.
పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న అతగాడు ఓ చిత్రమైన ప్లాన్ వేశాడు. ప్రేయసికి గతంలో తాను బహుమతిగా ఇచ్చిన ఐదు అడుగుల పెద్ద టెడ్డీబేర్ ను దీనికి వాడుకున్నాడు. టెడ్డీ బేర్ లోని దూది అంతా తీసేసి.. అందులో దూరాడు. టెడ్డీబేర్ ను ఓ మూల పడేసినట్టుగా వెళ్లి ఓ పక్కన కూర్చుండిపోయాడు. దొంగ అంత తెలివిగా టెడ్డీ బేర్ లా మారిన పోలీసులు పట్టేసుకున్నారు. ఇదంతా బ్రిటన్ లోని మాంచెస్టర్ లో జరిగింది. సదరు దొంగ పేరు జోషువా డాబ్సన్. మరి ఎలా దొరికిపోయాడో తెలుసా?
జోషువా డాబ్సన్‌ ఇటీవల ఓ కారును దొంగతనం చేశాడు. ఆ కారులో పెట్రోల్ పోసుకుని బంకు నుంచి డబ్బులు కట్టకుండా పరారయ్యాడు. ఇంతకు ముందూ మనోడికి ఓ కారు దొంగతనం చేయడం, సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎత్తుకుపోవడం వంటి ‘దొంగ’ చరిత్ర కూడా ఉంది. దాంతో పోలీసులు అతడి గురించి వెతుకులాట మొదలుపెట్టారు. ఇది తెలిసిన దొంగ తన ప్రేయసి ఇంట్లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికీ రావడంతో టెడ్డీబేర్ లో దూరి కూర్చున్నాడు.
అంతా బాగానే ఉందిగానీ.. భయపడిపోయో, బాగా ఉద్వేగంలోనో గానీ గట్టిగా శ్వాస తీసుకోవడంతో టెడ్డీబేర్ ఛాతీ భాగం కదిలింది. గాలి ధ్వని వచ్చింది. అనుమానంతో పోలీసులు టెడ్డీ బేర్ ను పరిశీలిస్తే డాబ్సన్ పట్టుబడిపోయాడు. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌ బుక్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏదేమైనా టెడ్డీ బేర్ దొంగ పాపులర్ అయిపోయాడు.

Untitled Document
Advertisements