పార్క్ కు వెళ్లి సరదాగా కాసేపు గడుపుదాం అంటే ఆ పార్క్‌ లో భర్త ఒకవైపు.. భార్య మరోవైపు

     Written by : smtv Desk | Sun, Aug 14, 2022, 11:11 AM

పార్క్ కు వెళ్లి సరదాగా కాసేపు గడుపుదాం అంటే ఆ పార్క్‌ లో భర్త ఒకవైపు.. భార్య మరోవైపు

వీకెండ్ లో కుటుంబం అంతా సరదాగా గడపడం చూస్తూనే ఉంటాం. కొందరు సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు వేరే ప్రాంతాలకు పిక్నిక్ కి వెళ్తుంటారు. అలా కుదరని వారు స్థానికంగా ఉండే పార్క్ కు వెళ్లి సరదాగా కాసేపు స్పెండ్ చేసి వస్తారు. అయితే.. తాలిబన్ల రాజ్యంలో అలా కుదరదు. ఆఫ్ఘాన్ ను తాలిబన్లు వశం చేసుకున్నాక ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఉన్నంత స్వేచ్ఛ జనాలకు ఉండడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనే అందుకు నిదర్శనం.
కాబూల్ లోని బాబర్ గార్డెన్ ఎంతో ఫేమస్. యునెస్కో వారసత్వ సంపదగా దీన్ని గుర్తించారు. కానీ, ప్రస్తుతం ఈ పార్క్ కు వెళ్లి ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. మగవారు ఓవైపు, ఆడవారు మరోవైపు వెళ్లాల్సిన రూల్ తీసుకొచ్చారు తాలిబన్లు. ఎంట్రన్స్ లోనే పురుషులు, మహిళలు వేర్వేరు గేట్లలో నుంచి లోపలికి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్లాక కలుస్తారా.. అంటే అదీ లేదు. పార్క్ ను రెండు భాగాలుగా విభజించారు. మధ్యలో తాళ్లను అడ్డుగా పెట్టారు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదో చెత్త రూల్ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పార్క్ కు వెళ్లేది కుటుంబం అంతా కలిసి కాసేపు గడిపి రావడానికి. భార్యాభర్తలు వెళ్తే.. తూర్పుకొకరు పడమరకొకరు అనేలా ఈ రూల్ ఉందని అంతా తిట్టిపోస్తున్నారు. గతేడాది ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న మూడు నెలల్లోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కానీ, జనాలకు మాత్రం ఈ విషయం పెద్దగా తెలియలేదు. పార్క్ కు వెళ్లాకే ఈ రూల్ ఒకటి ఉందని అర్థం అవుతోంది.
బాబర్ పార్క్ కు నిత్యం వందల మంది వస్తుంటారు. చినార్, వాల్‌ నట్ చెట్లు, రకరకాల పూలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. అయితే.. ఈ రూల్ కారణంగా ప్రజలు పార్క్ వైపు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. నిజానికి తాలిబన్ల ఐడియా కూడా ఇదే. మహిళలు ఇంట్లోనే ఉండాలనేది వీరి నిర్ణయం. బయటకు రాకూడదని.. అనేక ఆంక్షలు కూడా పెట్టారు. కొందరు ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. పార్క్ లో హిజాబ్ తీసేసి ఫోటోలు తీసుకుంటున్నారు.





Untitled Document
Advertisements