పాక్ ను ఒప్పించే సత్తా "డ్రాగన్" కు ఉంది : అమెరికా

     Written by : smtv Desk | Sun, Jan 07, 2018, 05:13 PM

పాక్ ను ఒప్పించే సత్తా

వాషింగ్టన్, జనవరి 7 : పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ఇటీవల అమెరికా పాక్ పై పలుమార్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా.. పాక్ తన వైఖరి మార్చుకోకుండా తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తోందని రక్షణ, భద్రత సహకారాన్ని యూఎస్‌ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు పాకిస్తాన్ ను చైనా ఒప్పించగలదని శ్వేతసౌధానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. "పాకిస్తాన్ కు చైనాతో సత్సంబంధాలున్నాయి. ఆ దేశ సైనికులతో మెరుగైన సంబంధాలను చైనా కలిగి ఉంది. అలాగే ఈ ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఉగ్రవాద సమస్యపై అమెరికా ఆందోళనను చైనా అర్థం చేసుకోగలదు. సమస్యను పరిష్కరించడంలో డ్రాగన్‌ కీలక పాత్ర పోషించగలదు. అటు ఆఫ్గాన్‌తో కూడా చైనా సంబంధాలను కలిగి ఉంది. కావున ఇరు దేశాలతో మాట్లాడి ఉగ్రవాదులపై పోరాటానికి చైనా ఒప్పించగలుగుతుంది" అన్నారు.





Untitled Document
Advertisements