సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు

     Written by : smtv Desk | Thu, Aug 25, 2022, 03:49 PM

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు

ఇప్పుడు ప్రపంచంలో ఏ ములాన ఏం జరిగిందో అన్నీ సోషల్ మీడియా లోనే చూస్తున్నాం.. మరియు ఒక్క క్లిక్ తో ఇక్కడ జరిగే సన్నివేశాన్ని ప్రపంచం అంతా చుపెట్టవచ్చు ఇలా అని కొంత మంది తప్పుడు ప్రచారానికి కూడా కొంత మంది ఉపయోగిస్తున్నారు..
విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే అధికంగా వాడేస్తోన్న రోజులివి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారానికి, రెచ్చగొట్టే పోస్టులకు అదుపులేకుండా పోతోంది.
సున్నిత అంశమైన మతాలపై కూడా చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ సమాజంలో విద్వేషాలు, అల్లర్లు చెలరేగేలా ప్రవర్తిస్తున్నారు. అయితే, ఇటువంటి పోస్టులు చేస్తే ఉపేక్షించబోమని, ఇటువంటి వాటిపై ఫిర్యాదులు రాకపోయినా చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా కొన్ని వారాల క్రితం నుపూర్ శర్మ(బీజేపీ బహిష్కృత నాయకురాలు) చేసిన వ్యాఖ్యల అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఎంతగా చర్చజరిగిందో తెలిసిందే. నిన్న ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఆయా అంశాలపై మరింత రెచ్చగొట్టేలా సాామాజిక మాధ్యమాల్లో చాలా మంది పోస్టులు పెడుతోన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. రాజకీయ నేతలు, పార్టీలపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిని గుర్తిస్తామని చెప్పారు. వారిపై కేసులు పెడుతున్నామని వివరించారు.
ఇక్కడి పోలీసులకు చిక్కకుండా కొందరు విదేశాల్లో ఉంటూ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. మతాలకు, రాష్ట్రంలోని రాజకీయ నేతలు, పార్టీలకు వ్యతిరేకంగా పలువురు ఎన్‌ఆర్‌ఐలు పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అటువంటి వారి వీసా, పాస్‌ పోర్టులను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పాస్‌పోర్టు కేంద్రాలకు సిఫారసు చేస్తామని అన్నారు. కొంత మంది పోలీసు కేసుల నుంచి తప్పించుకులా ఐపీ అడ్రస్‌లు మార్చి పోస్టులు పెడుతున్నారు.
అయినప్పటికీ, వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న పోస్టులపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో అనుచిత, చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టేవారిపై ఐటీ చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓ వర్గాన్ని అవమానిస్తూ పోస్టులు చేసినా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారం చేసినా శిక్షలు తప్పవని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశమూ ఉందని అన్నారు. అసత్య ప్రచారాన్ని షేర్ కూడా చేయొద్దని అన్నారు.





Untitled Document
Advertisements