రూ.899 కే ఇండిగో టిక్కెట్..!

     Written by : smtv Desk | Mon, Jan 08, 2018, 04:51 PM

రూ.899 కే ఇండిగో టిక్కెట్..!

న్యూఢిల్లీ, జనవరి 8 : విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ను అందించింది. కేవలం రూ.899 కే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే సోమవారం నుంచి బుధవారం మధ్య టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందనేది నిబంధన.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై టికెట్లు బుక్ చేసుకునే వారికి 10 శాతం క్యాష్‌ బ్యాక్‌తో పాటు రూ.600 విలువైన ఇండిగో ఓచర్‌లను కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ-చండీగఢ్ మధ్య టికెట్ ధర రూ.899 ఉండగా, ఢిల్లీ-జైపూర్ కి రూ.999, ముంబై-బెంగళూరుకు రూ.1,399, ముంబై-చెన్నై రూ.1,499, బ్యాంకాక్-కోల్‌కతా మధ్య టికెట్ ధర రూ.4,099 కాగా, దుబాయ్-ఢిల్లీకి రూ.5,299కే అందివ్వనున్నట్లు ఇండిగో వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో తెలిపింది.

Untitled Document
Advertisements