హెచ్‌1బీ వీసాదారులకు ఇకపై వూరట...

     Written by : smtv Desk | Tue, Jan 09, 2018, 02:30 PM

హెచ్‌1బీ వీసాదారులకు ఇకపై వూరట...

వాషింగ్టన్‌, జనవరి 9 : అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న భారతీయ హెచ్‌1బీ వీసాదారులకు వూరట లభించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీసా పొడిగింపు నిరాకరించి వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా వెనక్కి పంపిచాలనే నిబంధనలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, హెచ్‌1బీ వీసా దారులు ఇకపై ఆందోళన చెందే అవసరం లేదు. వేలాది మంది హెచ్‌1బీ వీసా దారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ఎలాంటి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోబోమని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం నేడు వెల్లడించింది.

ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాదారులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ మార్పులు ఏదైనా జరిగినా హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా కంపెనీలు అభ్యర్థించే అవకాశం ఉందని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాతన్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements