రిటైల్ రంగంలోకి నూరు శాతం ఎఫ్‌డీఐలు : కేంద్రం

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 03:24 PM

రిటైల్ రంగంలోకి నూరు శాతం ఎఫ్‌డీఐలు : కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 10 : 'మేక్ ఇన్ ఇండియా' లో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గమ్యంగా నిలిచిన భారత్.. ఆ నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. గతంలో కొన్ని రంగాలలో ఎఫ్‌డీఐల పరిమితిని పెంచిన కేంద్రం.. తాజాగా సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నట్లు పేర్కొ౦ది. పెట్టుబడిదారులను మరింత ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆటోమెటిక్ రూట్లలో నిర్మాణ రంగంలో నూరు శాతం పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియాలో విదేశీ సంస్థలు 49 శాతం పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా కేంద్రం నిర్ణయాన్ని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తీవ్రంగా ఖండించాయి. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయినట్లే అవుతుందని ఆరోపించింది.

Untitled Document
Advertisements