కాలిఫోర్నియాలో వరద బీభత్సం :20 మందికి పైగా గల్లంతు

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 03:58 PM

కాలిఫోర్నియాలో వరద బీభత్సం :20 మందికి పైగా గల్లంతు

అమెరికా, జనవరి 10 : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరద బీభత్సానికి కొండచరియలు విరిగిపడగ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. కొద్ది రోజులుగా కాలిఫోర్నియాలో వణికిస్తున్న తుఫాను మంగళవారం తీవ్ర రూపు దాల్చింది. దీంతో కుండపోత వర్షం కురిసి, వెంచురా కౌంటిలో ఏకంగా 5అంగుళాల వర్షపాతం నమోదైంది.

ఈకారణంగా శాంతా బార్బరా సమీపంలోని మౌంటు సిటీలో నీటి ప్రవాహానికి కొండలపై నుంచి భారీగా బురద, బండరాళ్లు కొట్టుకు వచ్చి ప్రజలు నివసించే గృహాలపై పడటంతో 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, శునకాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.

Untitled Document
Advertisements