శాంసంగ్‌ నుండి కొత్త స్మార్ట్ ఫోన్..

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 04:47 PM

శాంసంగ్‌ నుండి  కొత్త స్మార్ట్ ఫోన్..

న్యూఢిల్లీ, జనవరి 10 ; ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతుంది. అందుకు తగ్గట్టు మొబైల్ కంపెనీలు కూడా కోకొల్లలుగా వివిధ రకాల స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీదారు శాంసంగ్‌ మరో స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గెలాక్సీ ఏ8+ (2018) పేరిట సెల్ఫీ ప్రియులను అలరించేందుకు డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరాతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో శాంసంగ్‌ పే, బిక్స్బీ సదుపాయాన్ని కూడా సంస్థ కల్పించింది.


దీనిలో ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌ ఓఎస్‌, 6జీబీ ర్యామ్‌, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 1.6 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 16 ఎంపీ వెనుక కెమెరా, 64జీబీ అంతర్గత స్టోరేజీ (256జీబీ వరకు పెంచుకునే వీలు), 6 అంగుళాల (18:5:9 రేషియో) సూపర్‌ అమోల్డ్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఈ ఫోన్ ధర రూ.32,990గా కంపెనీ నిర్ణయించింది.

Untitled Document
Advertisements