అడవిలో మ్రుగాలన్నింటిని వణికించే పులితోనే ఆటాడుకున్న కోతి

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 02:00 PM

అడవిలో మ్రుగాలన్నింటిని వణికించే పులితోనే ఆటాడుకున్న కోతి

అడవిలో క్రూర జంతువులు, ఇతర జంతువులను వేటాడి తింటుంటాయి. సింహాలు, పులులు, చిరుతపులులు వేటాడి ఇతర జంతువులను తింటాయి. క్రూర జంతువుల బారి నుంచి తప్పించుకొవడానికి సాధు జంతువులు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో క్రూర జంతువుల బారిన పడి సాధు జంతువులు వాటికి ఆహారంఅయిపోతే మరికొన్నిసార్లు మాత్రం క్రూర జంతువులకే, ఇతర జంతువులు చక్మా ఇచ్చి తప్పించుకుంటాయి. ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.తాజాగా, మరో వీడియో వైరల్ గా మారింది.
అడవిలో చిటారు కొమ్మన కోతి ఎక్కికూర్చుంది. దాన్ని వేటాడుతూ మరో పెద్దపులి చెట్టుమీదకు ఎక్కింది. పెద్ద పులి పైకి ఎక్కిన కొలది.. కోతి దానికి అందకుండా తెగ ప్రయత్నాలు చేస్తుంది. కోతి కడుపుకు ఒక పిల్లకూడా కన్పిస్తుంది. అయితే.. పెద్దపులి ఎంత ప్రయత్నం చేసిన కోతిని మాత్రం పట్టుకోలేకపోయింది. చివరకు పాపం అది బ్యాలెన్స్ తప్పి చెట్టుమీద నుంచి నెల మీదకు పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దపులికి చుక్కలు చూపిస్తున్న కోతి వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే తప్పించుకుంది.’‘కోతి లక్ బాగా ఉన్నట్టుంది.’అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1499432035076964353





Untitled Document
Advertisements