పెరిగిన గృహ రుణాల రేట్లు

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 03:44 PM

పెరిగిన గృహ రుణాల రేట్లు

ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు గృహ రుణాలపై రేట్లను పెంచాయి. గత వారం ఆర్బీఐ కీలక రెపో రేటును అర శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంక్ లు సైతం వెంటనే రుణాలపై రేట్లను సవరించాయి. ఎస్ బీఐ అర శాతం పెంచింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటును అరశాతం పెంచింది. దీంతో ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 8.55 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.15 శాతానికి చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును సవరించి 8.45 శాతానికి పెంచింది. గృహ రుణాలపై ఈ రేటు అమలు కానుంది. 20 సంవత్సరాల కాలవ్యవధికి ₹35 లక్షల హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్‌ని ఉదాహరణగా తీసుకుంటే వారి హోమ్ లోన్‌పై పాత వడ్డీ రేటు 8.05 శాతం అయితే, సవరించిన రేట్లు తర్వాత ఇప్పుడు వడ్డీ 8.55 శాతం ఉంటుంది.





Untitled Document
Advertisements