అమెరికా, పాక్‌కు చేసిన ఆర్థిక సాయం తిరిగి అడగనుందా?

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 05:21 PM

అమెరికా, పాక్‌కు చేసిన ఆర్థిక సాయం  తిరిగి అడగనుందా?

వాషింగ్టన్, జనవరి 10 : అమెరికా అగ్రరాజ్యం పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ ఆ దేశానికి అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు పాక్ ఎలాంటి ఆందోళన చెందటం లేదని...ఇంకా చెప్పాలంటే చైనా స్నేహహస్తంతో ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌కు ఇప్పటి వరకు ఇచ్చిన నిధులను తిరిగి తీసుకోవాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 16 ఏళ్లుగా అమెరికా నుంచి 33 బిలియన్‌ డాలర్లకు పైగా సాయం పొందిన పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందంటూ అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడంతో, రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో ఈ ఏడాది నుంచి తాము అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు అమెరికా తేల్చి చెప్పింది.

మరోవైపు పాక్...అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమీ కాదని, గత కొంతకాలంగా ఆ దేశం తమ సాయాన్ని తగ్గిస్తూ వస్తోందని ఇటీవల పాక్‌కు చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా సాయం చేయకున్నా, చైనా తమకు ఆర్థికంగా ఆదుకుంటుందని పాక్‌ భావిస్తోంది. ఇప్పటి వరకు పాక్‌కు పలు ప్రాజెక్టుల విషయంలో చైనా 60 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ట్రంప్ తీసుకోబోయ్యే నిర్ణయంతో పాక్ ఆర్థిక వ్యవస్థ ఎదురుదెబ్బ తగలనుందా, లేదా చైనా ఆ దేశానికి అధిక మొత్తంలో సాయం చేయనుందా అన్న విషయం కోసం వెచ్చి చూడాలి.

Untitled Document
Advertisements