ట్రంప్ పై ఓప్రాదే పైచేయి : అమెరికన్ పోల్

     Written by : smtv Desk | Thu, Jan 11, 2018, 12:32 PM

ట్రంప్ పై ఓప్రాదే  పైచేయి : అమెరికన్ పోల్

వాషింగ్టన్, జనవరి 11 : ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే.. వచ్చే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సునాయాసంగా ఓడించగలదని అమెరికా పోల్ వెల్లడించింది. ఇటీవల యూఎస్ లో జరిగిన 75 గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో పాల్గొన్న ఓప్రా.. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పరోక్షంగా తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. ఆమెను నేను ఓడించగలను అని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాస్‌మ్యూసెన్‌ నిర్వహించిన నివేదికలో.. ట్రంప్ కు రిపబ్లికన్ల నుండి వచ్చిన మద్దతు కంటే డెమోక్రాట్ల నుండి ఓప్రాకు ఉన్న మద్దతే ఎక్కువని తేలిందట. ఈ మేరకు ఓప్రాకు 76 శాతం డెమోక్రాట్లు, ట్రంప్‌కు 66 శాత౦ రిపబ్లికన్లు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements