మహిళలకు మాత్రమే ఈ కార్ల షో రూమ్...

     Written by : smtv Desk | Fri, Jan 12, 2018, 01:03 PM

మహిళలకు మాత్రమే ఈ కార్ల షో రూమ్...

జెడ్డా, జనవరి 12: మహిళల కోసమే ఓ కార్ల షో రూమ్ ను ప్రారంభించారు. అది ఎక్కడంటే.. మహిళలలకు కఠినమైన ఆంక్షలు విధించే సౌదీ అరేబియాలో. పురుషులతో పాటు మహిళలు కూడా డ్రైవింగ్‌ చేయొచ్చని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఓ కంపెనీ ఈ కార్ల షో రూమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జెడ్డాలోని రెడ్‌ సీ పోర్ట్‌ సిటీలో గల ఓ షాపింగ్‌ మాల్లో మహిళలకు మాత్రమే అంటూ కార్ల షో రూమ్ ను ఆరంభించారు. స్వయంగా మహిళలు ఇక్కడకు వచ్చి తమకు నచ్చిన కారును ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదండోయ్‌ ఈ షోరూంలో పనిచేసే సిబ్బంది కూడా మహిళలేనట. అయితే ఇలాంటి వినూత్న ఆలోచనతో షో రూమ్ ప్రారంభించిన సంస్థ పేరు మాత్రం తెలియరాలేదు.

Untitled Document
Advertisements