ఎయిర్‌ ఇండియా ఫర్ సేల్..!!

     Written by : smtv Desk | Fri, Jan 12, 2018, 04:30 PM

ఎయిర్‌ ఇండియా ఫర్ సేల్..!!

న్యూఢిల్లీ, జనవరి 12 : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను అమ్మేయనున్నారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. కాని పూర్తిగా కాదండోయ్. 26శాతం వాటా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న ఎయిర్‌ ఇండియాకు మొత్తం రూ.52వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియాను అమ్మకానికి పెట్టినట్లు సిన్హా పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నడుపుతున్న ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ మాత్రమే ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియాను కొనడానికి బహిరంగంగా ముందుకొచ్చింది. కాని ఎయిర్‌ ఇండియాను ఎవరు దక్కించుకుంటారో అనే విషయం తెలియడానికి సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

Untitled Document
Advertisements