వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌..!!

     Written by : smtv Desk | Fri, Jan 12, 2018, 05:01 PM

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌..!!

న్యూఢిల్లీ, జనవరి 12 : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ రానుంది. వాట్సాప్‌ గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్‌ నుండి తొలగించకుండా అడ్మిన్‌గా మాత్రమే తొలగించే సౌకర్యం తీసుకురాబోతోంది. గ్రూప్‌లో ఎంతమందైనా గ్రూప్‌ అడ్మిన్‌లుగా ఉండొచ్చు కాని అడ్మిన్ బాధ్యతల నుండి తొలగించాలంటే మాత్రం ముందు వారిని ఆ గ్రూప్‌ నుంచి పూర్తిగా తొలగించి, మళ్ళీ గ్రూప్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అడ్మిన్ బాధ్యతల నుండి తొలగించడానికి ఇకపై ఇంత శ్రమ అవసరం లేదు. నేరుగా అడ్మిన్‌ను తొలగించేందుకు వీలుగా "డిస్మిస్‌" బటన్‌ను వాట్సాప్‌ కొత్తగా తీసుకురాబోతోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Untitled Document
Advertisements