ఇన్ఫోసిస్‌ అధినేత రాజీనామా...

     Written by : smtv Desk | Fri, Jan 12, 2018, 06:15 PM

ఇన్ఫోసిస్‌ అధినేత రాజీనామా...

బెంగుళూరు, జనవరి 12: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో మరో అధినేత రాజీనామా చేశారు. కంపెనీలోని ముగ్గురు అధినేతల్లో ఒకరైన రాజేష్‌ మూర్తి, కంపెనీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన 26 ఏళ్లుగా ఇన్ఫీలో పనిచేస్తున్నారు. ఆయన అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనిని బట్టి మూర్తి వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సలీల్‌ పరేఖ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జిక్యూటివ్‌ ఈయనే.

Untitled Document
Advertisements