ట్రంప్ ఆరోగ్యకరంగా ఉన్నారు :డాక్టర్‌ రోనీ

     Written by : smtv Desk | Sat, Jan 13, 2018, 12:19 PM

ట్రంప్ ఆరోగ్యకరంగా ఉన్నారు :డాక్టర్‌ రోనీ

వాషింగ్టన్‌, జనవరి 13 : అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యకరంగా ఉన్నారని ఆయనకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో డాక్టర్‌ రోనీ జాక్సన్‌ ఆయనకు కొన్ని గంటల పాటు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. బీపీ, కొలెస్ట్రాల్‌, బ్లడ్‌ షుగర్‌, గుండె స్పందన, బరువు వంటి పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ...ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని రోనీ అన్నారు.

ఈ మేరకు ఆయన ఆరోగ్యస్థితిపై పూర్తి నివేదికను జనవరి 16న మీడియాకు ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు. సాధారణంగా ప్రతి అధ్యక్షుడికి రొటీన్‌ హెల్త్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఇటీవల కొందరు ట్రంప్ మానసికస్థితిపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే మానసికంగా ఫిట్‌గా లేరంటూ ఎద్దేవా చేశారు. దీనికి ఆగ్రహించిన ట్రంప్‌ తనను తాను చాలా తెలివైన వ్యక్తినని, స్మార్ట్‌ అని ట్విటర్‌లో తెలిపారు.

Untitled Document
Advertisements