ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన యువకుడు

     Written by : smtv Desk | Sat, Jan 13, 2018, 02:15 PM

 ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన యువకుడు

ఇండోర్‌, జనవరి 13 : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓ విద్యార్థి చిరంజీవిగా నిలిచినా ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఇండోర్‌కు చెందిన 20ఏళ్ల మృదుల్ స్థానిక కళాశాలలో బీసీఏ చదువుతున్నాడు. అయితే, మృదుల్‌ ఇంటికి చెరువలో ఓ యువతినితో ఆయన స్నేహాంగా ఉండేది. దీన్ని గమనించిన ఆ యువతిని ప్రేమించిన వ్యక్తి ఆకాశ్ తట్టుకోకలేకపోయ్యాడు. తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నడన్నా అనుమానం వచ్చి ఈ నెల 7న మృదుల్‌ను ఆకాశ్, మరో ఇద్దరి స్నేహితుల సహాయంతో కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మృదుల్‌పై వారు తీవ్రంగా దాడి చేశారు. బండరాయితో మోదారు.

ఆ తర్వాత చనిపోయాడని భావించి లోయలోకి విసిరేశారు. మరోవైపు కనిపించకుండా పోయిన మృదుల్‌ కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్‌ డేటా పరిశీలించి, వీటి ఆధారంగా ఆకాశ్‌, పీయూష్‌, విజయ్‌ అనే ముగ్గురిని అనుమానితులుగా అరెస్టు చేసి విచారించగా, వారు అసలు విషయం బయట పెట్టారు. నిందితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విస్తృత తనిఖీలు చేపట్టారు. గత ఆదివారం ఈ ఘటన జరగగా, శుక్రవారం మృదుల్‌ను గుర్తించారు. అప్పటికే కోనఊపిరితో కొట్టుకుంటున్న అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు చికిత్స చేసిన వైద్య బృందం తెలిపింది. ఇంతా కిరాతకంగా ప్రవర్తించిన ఆ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.

Untitled Document
Advertisements