చంద్రగిరికి చంద్రబాబు ఏం చేశాడు : వైఎస్‌ జగన్‌

     Written by : smtv Desk | Sat, Jan 13, 2018, 05:24 PM

 చంద్రగిరికి చంద్రబాబు ఏం చేశాడు : వైఎస్‌ జగన్‌

రామచంద్రాపురం, జనవరి 13: సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఆశ్చర్యం ఏంట౦టే 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చలవతో మంత్రి కూడా అయ్యాడు.

మంత్రి అయి ఐదేళ్లు పరిపాలన చేశాడు. మళ్లీ 1983లో ఎన్నికలు జరిగా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదే చంద్రగిరి నుంచి బరిలోకి దిగితే 17,500 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. సొంతవూరికి ఏదైనా చేయాలని కాస్తోకూస్తో గొప్పగా సెటిల్‌ అయిన ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా సొంత గడ్డకు ఏదైనా చేయాలని తపన పడతారు. డబ్బు పంపించి అభివృద్ధికి పాటుపడతారు. కాని చంద్రబాబు చంద్రగిరి అభివృద్దికి చేసిందేమీ లేదని జగన్ ఎద్దేవా చేశారు.

అలాంటిది 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సొంతవూరు ఉండాల్సిన స్థితి ఇదా?. చిన్నవయసులో చంద్రబాబు నారావారిపల్లె పక్కన ఉన్న శేషాపురం స్కూల్‌లో చదువుకున్నారు. ఇవాళ్టికి కూడా ఈ స్కూల్‌కు పిల్లలు వెళ్తున్నారు. గట్టిగా తుమ్మితే పడిపోయే దుస్థితిలో పాఠశాల ఉంది. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూల్‌ పరిస్థితి ఇలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.







Untitled Document
Advertisements